Ambedkar Photo Row : అంబేద్కర్ కు ఉన్న శక్తి ఏమిటో, ఆయన పట్ల అభిమానం ఎలా ఉంటుందో ఈ చైతన్యం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఈ దేశంలో కోట్లాది మంది ఇప్పటికీ నిరాశ్రయులుగా, పేదలుగా ఉన్నారు.
దేశంలోని 85 శాతం సంపద కేవలం 15 శాతం మంది వ్యక్తుల్లో కేంద్రీకృతమై ఉంది. ఇక ఇప్పుడు మరో కొత్త నినాదం ఊపందుకుంది. అదేమిటంటే బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని. కానీ కర్ణాటక ఇప్పుడు పలు వివాదాలకు(Ambedkar Photo Row) కేరాఫ్ గా మారింది.
హిజాబ్ వివాదం ఓ వైపు కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో వివాదం దేశం తమ వైపు చూసేలా చేసింది. అదేమిటంటే అంబేద్కర్ పై ఓ న్యాయవాది చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. లక్షలాది మంది రోడ్డెక్కారు.
ఓ చేతిలో నీలి జెండా, మరో చేతిలో అంబేద్కర్ చిత్ర పటం(Ambedkar Photo Row). న్యాయం జరగాలంటూ నినదించారు. భారీ ఎత్తు చేసిన ఈ ప్రదర్శన ఒక్కసారిగా బెంగళూరు మొత్తం నీలి మయంగా మారింది.
ఇది ప్రచా చైతన్యానికి కొండ గుర్తు. పెద్ద ఎత్తున సాగిన ఈ ప్రదర్శన నగరంలోని ఫ్రీడం పార్క్ కు సాగింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కదిలించింది.
ఏకంగా సీఎం బస్వరాజ్ బొమ్మై అక్కడికి వచ్చారు. నిరసనకారుల డిమాండ్లకు ఓకే చెప్పారు. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా గాంధీ ఫోటో పక్కనే అంబేద్కర్ ఫోటో ఉండటాన్ని రాయచూర్ జిల్లా జడ్జి మల్లికార్జున గౌడ అభ్యంతరం తెలిపారు.
ఆయనను పూర్తిగా తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
Also Read : అన్నను కలిసిన తమ్ముడు