Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన కామెంట్స్ చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
నిన్న రాత్రి భజరంగ్ దళ్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ తరుణంలో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మరో వైపు హిజాబ్ వివాదం అంశం రాష్ట్ర హైకోర్టులో ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇంటి వద్ద వరకు, వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు దుస్తులు ధరించవచ్చు. కానీ విద్యా సంస్థల వరకు వచ్చే సరికల్లా అందరూ ఒక్కటేనని స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్.
తాజాగా ఈ హిజాబ్ వివాదం దేశాన్నే కాదు సరిహద్దులను దాటింది. దీనిపై ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దాయాది పాకిస్తాన్ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ తరుణంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మత పరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం దుస్తులు ధరించేందుకే తాను ఎక్కువగా ఇష్ట పడతానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
అయితే హైకోర్టు ఇచ్చే ఆదేశాలను తాను కూడా గౌరవిస్తానని స్పష్టం చేశారు. దేశంలో 13 శాతం ఉన్న ముస్లింలకు ఈ దేశంలో గౌరవనీయమైన స్థానం ఉందన్నారు. అన్ని మతాల వారు స్కూల్ డ్రెస్ కోడ్ ను అంగీకరించాలని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా.
Also Read : సీబీఐ వద్దకు రిషి అగర్వాల్