Ukraine Ambassador : మోదీజీ పుతిన్ తో మాట్లాడండి

ఉక్రెయిన్ రాయ‌బారి పోలిఖా

Ukraine Ambassador : ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌ను ఆపేలా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జోక్యం చేసుకోవాల‌ని ఆ దేశం త‌ర‌పు రాయ‌బారి పోలిఖా కోరారు. ఇవాళ ఆయ‌న ఎంబ‌సీ కార్యాల‌యం నుంచి మాట్లాడారు.

ప్రపంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన దేశాధి నేత‌ల‌లో మోదీ కూడా ఒక‌ర‌ని తెలిపారు. ప్ర‌స్తుతం మోదీకి ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ క‌మ్రంలో ఉక్రెయిన్ పై ఆ దేశం ఏక‌ప‌క్ష దాడుల నుంచి ర‌క్షించేందుకు జోక్యం చేసుకోవాల‌ని సూచించారు. త‌మ దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోవ‌డం లేద‌ని స్పష్టం చేశారు.

తాము భార‌త దేశం లాగానే శాంతిని కోరుకుంటున్నామ‌ని కానీ ర‌ష్యా కావాల‌నే క‌య్యానికి కాలు దువ్వుతోంద‌ని ఆరోపించారు. ర‌ష్యా దాడుల కార‌ణంగా ఉక్రెయిన్ ఇప్పుడు పూర్తిగా విధ్వంసానికి గుర‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు.

ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. మీరు జోక్యం చేసుకుంటే జ‌రిగే ప్రాణ న‌ష్టం నుంచి , ఆస్తి న‌ష్టం నుంచి కాపాడిన వార‌వుతార‌ని సూచించారు పొలిఖ్(Ukraine Ambassador).

విశేష‌మైన‌, వ్యూహాత్మ‌క సంబంధం ఉంద‌ని ప్ర‌పంచానికి తెలుసు. ఇదిలా ఉండ‌గా ర‌ష్యా ఏ ఒక్క‌రి జోక్యాన్ని తాము స‌హించ బోమంటూ స్ప‌ష్టం చేశారు ఆ దేశ అధ్య‌క్షుడు పుతిన్.

తాము ముందుకే క‌దులుతామ‌ని వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తి లేదంటూ పేర్కొన్నారు. దీంతో మ‌రింత ప‌రిస్థితి ఉద్రిక్తంగా, ద‌య‌నీయంగా మారింది. ఈ ఏక‌ప‌క్ష దాడుల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని అంచ‌నా.

Also Read : మాలిక్ అరెస్ట్ పై సిస్ట‌ర్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!