Anand Subramanian : దేశంలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ – ఎన్సీఏ నిధుల మల్లింపు కుంభకోణం కేసులో ఆనంద్ సుబ్రమణియంను(Anand Subramanian) సీబీఐ అరెస్ట్ చేసింది.
సంస్థ మాజీ సీఇఓ చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు, మాజీ గ్రూప్ ఆపరేషన్స్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియం(Anand Subramanian) సంస్థకు సంబంధించిన నిధులను అక్రమ మార్గాల్లో విదేశాలకు మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రాత్రి పొద్దు పోయాక చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు చిత్రా రామకృష్ణను ప్రశ్నించింది సీబీఐ . ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ తరుణంలో ఆనంద్ సుబ్రమణియంను అరెస్ట్ చేయడంతో ఇతర వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా మూడేళ్ల పాటు ఎండీగా, సిఇఓగా పని చేశారు.
ఇదే సమయంలో హిమాలయాల్లో నివసించే ఓ యోగితో సంభాషించడం అంతే కాకుండా ప్రధాన డేటాను ఆయనకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె హయాంలోనే ఆనంద్ సుబ్రమణియంను ఎంపిక చేసినట్లు సమాచారం.
కీలక పదవిలో ఉన్న ఆయనకు మార్కెటింగ్ కు ఎలాంటి అవగాహన లేక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం సెబీ విచారణలో బట్ట బయలు అయ్యింది.
ప్రమోషన్లు కూడా రావడం వ్యవహారం చర్చకు దారితీసింది. చిత్రా రామకృష్ణతో పాటు సెబీల్లో పని చేసిన , చేస్తున్న వారందరినీ విచారిస్తోంది దర్యాప్తు సంస్థ. అంతే కాకుండా సెక్యూరిటీస్ ప్రమోట్ సంజయ్ గుప్తా పై కూడా కేసు నమోదైంది.
Also Read : భగ్గుమన్న బంగారం కొనడం కష్టం