Ukraine Fight : రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది ఉక్రెయిన్ పై . ఉక్రెయిన్ (Ukraine Fight)మాత్రం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధ భూమిలోకి దూకాడు.
తానే ముందుండి సైన్యాన్ని నడిపిస్తున్నాడు. బహుషా ప్రపంచ చరిత్రలో చేగువేరా, ఫెడరల్ కాస్ట్రో, హ్యూగో చావెజ్ తర్వాత ఈ యోధుడు హాట్ టాపిక్ గా మారాడు. చావంటే భయం లేదని, తనే రష్యాకు ప్రధాన టార్గెట్ అని ప్రకటించాడు.
అంతే కాదు అధ్యక్ష భవనాన్ని తాము కోల్పోయే ప్రసక్తి లేదన్నాడు. ఆర్మీ చీఫ్ లతో కలిసి సందేశం ఇచ్చాడు. దేశం కోసం ప్రజలు సన్నద్దం కావాలని పిలుపునిచ్చాడు.
నిన్నటి దాకా ఆర్మీ పోరాటం సాగిస్తుండగా సాధారణ పౌరులు రష్యా సైనిక దళాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచారు. తాజాగా ప్రతి ఒక్కరు తాము సైతం సమిధలు అయ్యేందుకు ముందుకు వస్తున్నారు.
బహుశా తమకు యుద్దం కంటే ఈ పవిత్ర భూమి గొప్పదని, దీనిని ఎవరి చేతుల్లోకి వెళ్లేందుకు తాము ఒప్పుకోబోమంటూ స్పష్టం చేశారు. మనం ఎన్నడూ యుద్దాన్ని ఆహ్వానించ లేదు.
ఇది కచ్చితంగా కయ్యానికి కాలు దువ్వడమే. కానీ రష్యా ఏ మాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ పై దాడి చేయడం ఆపాలంటూ రష్యాలో ప్రజలు ఆందోళనలు చేపట్టారు.
ఇప్పటి వరకు 1000 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రష్యాకు చెందిన యుద్ద ట్యాంకులను ఉక్రెయిన్లు నిప్పంటించారు.
నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగుతోంది. కీవ్ నగరాన్ని చేజిక్కించు కోవాలన్న రష్యా ఇంకా పోరాడుతూనే ఉంది.
Also Read : యుద్దం దారుణం అమానవీయం – పోప్