Russia Attack : ర‌ణ రంగం మారణ హోమం

యుద్ధ స్థ‌లి నుంచి ఆర్త‌నాదాలు

Russia Attack : బాంబుల మోత‌లు..సైనికుల దాడులు..క్షిప‌ణుల అటాకింగ్ తో ఉక్రెయిన్ పూర్తిగా ర‌క్తంతో త‌డిసి ముద్ద‌యింది. ఓ రాజ్యాధినేత అధికార వాంఛ‌(Russia Attack), కాంక్ష‌కు ప్ర‌తిరూప‌మే ఈ మార‌ణ హోమం. ఒక ర‌కంగా చెప్పాలంటే రావ‌ణ కాష్టాన్ని త‌ల‌పింప చేస్తోంది.

ఎక్క‌డ చూసినా విధ్వంసాల దాడుల‌తో కూలిన భ‌వ‌నాలు, శిథిల‌మై పోయిన బ‌తుకులు, చెదిరి ప‌డిన మృత దేహాల‌తో ఉక్రెయిన్ మోయ‌లేని విషాదాన్ని తీసుకు వ‌చ్చింది.

ఎడ తెరిపి లేకుండా దాడుల దెబ్బ‌కు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకునేందుకు ప్ర‌జ‌లు క‌ట్ట‌డాలు, బంక‌ర్ల‌లో త‌ల‌దాచుకున్న వాళ్లు ఎంద‌రో. ఓ వైపు ఐక్య రాజ్య స‌మితి, యూరోపియ‌న్ దేశాలు ఇంకో వైపు అమెరికా హెచ్చ‌రిక‌లు జారీ చేసినా ర‌ష్యా ప‌ట్టించు కోలేదు.

స‌రిక‌దా నాసాను కూల్చి వేస్తాన‌ని బ‌హిరంగంగా హెచ్చ‌రించింది. తాము పౌరుల‌ను ఏమీ చేయ‌మ‌ని ప్ర‌క‌టించినా ఆ త‌ర్వాత అన్ని వైపులా దాడులకు పాల్ప‌డుతూ వ‌చ్చింది.

స్కూళ్లు, నివాస భ‌వ‌నాలు, ఇత‌ర వాటిపై కూడా దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఇదే స‌మ‌యంలో ర‌ష్యా సైన్యం దాడి చేసిన అనంత‌రం పేల‌ని బాంబుల‌ను ఉక్రెనియ‌న్ సైనికులు సేక‌రించ‌డం కంట‌త‌డి పెట్టించింది.

యావ‌త్ ప్ర‌పంచం ముందు ర‌ష్యా దోషిగా నిల‌బ‌డింది. ఇంకో వైపు తాను చావనైనా చ‌స్తాను కానీ ర‌ష్యాకు లొంగి పోయే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ.

ఉక్రెయిన్ గ‌నుక ఆర్మీని అప్ప‌గిస్తే లేదా లొంగిపోతే తాము చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. కానీ ఇంకో వైపు యుద్దాన్ని మాత్రం ఆప‌డం లేదు. రెండు నాల్క‌ల ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది.

Also Read : జ‌నం చేతుల్లో ఆయుధాలు

Leave A Reply

Your Email Id will not be published!