Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన ఎప్పటి లాగే బైడెన్ పై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రెసిడెంట్ చేతకాని తనం, బాధ్యతా రాహిత్యం కారణంగానే రష్యా రెచ్చి పోతోందంటూ ఆరోపించారు.
తాను గనుక ఉంటే ఉక్రెయిన్ పై దాడి జరిగి ఉండేది కాదన్నారు. ఒక రకంగా ముందు చూపు లేక పోవడం, కట్టడి చేయక పోవడం, శత్రు దేశం కదలికలను పసిగట్టక పోవడం వల్లనే దారుణమన్నాడు.
ఇప్పటికే సామాజక మాధ్యమాలను టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో తనపై నిషేధం విధించిన ఆయా సంస్థలకు షాక్ ఇచ్చాడు అంతే కాకుండా ట్రంప్ ఏకంగా నాటో కూటమి దేశాలను కరిగి పారేశాడు.
ఇదిలా ఉండగా నాలుగో రోజు కూడా ఉక్రెయిన్ పై రష్యా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు 300కి సౌగా సాధారణ ప్రజలు చని పోయారు. వారిలో పిల్లలు సైతం ఉండడం బాధాకరం.
ఈ తరుణంలో దాడులను వెంటనే ఆపాలని కోరాడు ట్రంప్ రష్యాను. ఇది మంచి పద్దతి కాదన్నారు. రష్యా దాడికి ప్రధాన కారణం బైడెన్ , నాటో కూటమి అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఫ్లోరిడా లోని ఓర్లాండ్ లోజరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. బైడన్ బలహీనత కారణంగానే రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగుతోందంటూ(Trump) ధ్వజమెత్తారు.
ఇకనైనా చేతులు ముడుచుకు కూర్చోకుండా రంగంలోకి దూకాలని పిలుపునిచ్చాడు. అంతే కాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరగక పోతే ఈ భయంకరమైన విపత్తు జరిగి ఉండేది కాదన్నారు.
Also Read : రణ రంగం మారణ హోమం