VK Singh : ఉక్రెయిన్ పై రష్యా దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు చర్చలు కొనసాగిస్తామంటూనే ఇంకో వైపు బాంబుల మోత మోగించేందుకే మొగ్గు చూపుతోంది రష్యా. నిన్నటి దాకా యుద్ద విమానాలు, ట్యాంకర్ల ద్వారా కాల్పులు జరిపింది.
తాజాగా వైమానిక దళాలతో దాడులు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ కేపిటల్ సిటీ కీవ్, ఖర్కీవ్ లో ఈ దాడులకు హద్దు అదుపు లేకుండా పోయంది. ఇరు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు.
సైనికులు ఒకరిపై మరొకరు కాల్పుల మోత మోగిస్తున్నారు. చాలా మంది ప్రజలు బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన భారతీయ విద్యార్థులను తీసుకు వచ్చేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ (VK Singh )పోలాండ్ వెళ్లారు.
ఇవాళ ఆయన కీలక ప్రకటన చేశారు. కీవ్ సిటీలో భారత్ కు చెందిన స్టూడెంట్ పై కాల్పులు జరిగినట్లు చెప్పారు. రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించు కునేందుకు యత్నిస్తుండగా విద్యార్థిపై ఫైరింగ్ జరిగిందని తెలిపారు.
గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం వైద్య చికిత్స అందుతోందన్నారు. ఇప్పటికే మరో విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందాడు. ఇంకా 17 వందల మందికి పైగా అక్కడే ఉన్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు 17 వేల మందికి పైగా స్టూడెంట్స్ ను ఇండియాకు తీసుకు వచ్చామన్నారు వీకే సింగ్(VK Singh ). విచిత్రం ఏమిటంటే కేవలం మెడిసిన్ కోసమే 20 వేల మందికి పైగా చదువుకునేందుకు ఉక్రెయిన్ కు వెళ్లారు.
ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా ఉంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగితే కొంత మేరకైనా ప్రశాంతత నెలకొనే అవకాశం ఉంటుంది. లేక పోతే ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
Also Read : తైవాన్ పై ట్రంప్ సంచలన కామెంట్స్