Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఆయనపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల ప్రచారంపై ఉన్నంత శ్రద్ద ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన విద్యార్థుల గురించి పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే ఒక విద్యార్థి చని పోయాడని ఇవాళ ఇంకొక విద్యార్థిపై కాల్పులు జరపడం దారుణమన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ (Mamata Banerjee)నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కు పెట్టారు. యూపీలో రాచరిక పాలన సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారంటూ మండి పడ్డారు.
దేశంలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ గంప గుత్తగా అమ్ముకుంటూ వెళుతున్న మోదీకి గుణ పాఠం చెప్పాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఓ వైపు చదువుకునేందుకు వెళ్లిన అమాయక విద్యార్థులు బలై పోయే పరిస్థితి నెలకొందన్నారు.
ఈ రోజు వరకు ప్రధానిగా తన బాధ్యతలను ఏనాడో విస్మరించారంటూ మండిపడ్డారు. విద్యార్థుల సంక్షేమం కోసం పాటు పడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో యోగి పాలనకు కాలం చెల్లిందన్నారు మమతా బెనర్జీ. సమాజ్ వాది పార్టీ కూటమికి ప్రజలు వైపు ఉన్నారని, మార్చి 10 తర్వాత పవర్ లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఓ వైపు రైతులను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు వరకు వారికి పరిహారం రాలేదని, చని పోయిన కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదని ఆరోపించారు సీఎం.
Also Read : అబద్దాలు ఆడడంలో బీజేపీ టాప్