#BananaBenefits : అరటి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోగానాలున్నాయా ?
సంవత్సరమంతా అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండు ఒకటి.
Banana : సంవత్సరమంతా అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు చాలా తక్కువ ధరలోనే లభించడం వల్ల దీనిని పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. మీరు సాయంత్రంపూట ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే మీకు రాత్రి బాగా నిద్ర పడుతుంది.
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన బ్లెడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి రక్తహీనత రాకుండా చేస్తుంది. మీరు రోజంతా అలసిపోయినప్పుడు అరటిపండు తినడం వల్ల అందులోని పొటాషియం నీరసాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ఎసిడిటిని తగ్గిస్తుంది.
డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి రెండు, మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి మలబద్దకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తి పెరిగేందుకు అరటిపండ్లు బాగా ఉపయోగపడతాయి. ఎదుగుతున్న పిల్లలకు అరటి పండు చాలా మంచిది.
No comment allowed please