Punjab Congress : పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి(Punjab Congress) కోలుకోలేని షాక్ తగిలింది. గట్టి పోటీ ఇస్తుందని ఆశించినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్ష పార్టీగా అవతరించింది. ప్రజలు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై నమ్మకం ఉంచారు.
ముందస్తు గానే అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు కేజ్రీవాల్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తన పట్టును పంజాబ్ లో కోల్పోయింది.
బాధ్యతా రాహిత్యం కంటే ఎక్కువగా ఆ పార్టీని కొంప ముంచింది మాత్రం ఆ పార్టీకి చెందిన నాయకులేనని చెప్పక తప్పదు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన ఆ పార్టీని గట్టెక్కించే బాధ్యతను సిద్దూ (Punjab Congress)భుజాన వేసుకున్నా చివరకు చేతులెత్తేసింది.
దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పదవి కట్టబెట్టినా కాంగ్రెస్ వ్యూహం పని చేయలేదు. హరీష్ రావత్ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరూ ఆ పార్టీని రక్షించ లేక పోయారు.
ఓటమి నుంచి కాపాడ లేక పోయారు. చివరి దాకా అత్యంత ధీమాగా ఉన్న కాంగ్రెస్ ఆఖరులో ఆప్ ను తట్టుకోలేక చేతులెత్తేసింది. ఈ పార్టీ ఘోర ఓటమి చవి చూసేందుకు ప్రధాన కారణం ఆ ఇద్దరే.
వారే అన్నీ తామే అయి నడిపించారు. ఆప్ తయారు చేసిన మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు సిద్దూ, చన్నీ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చివరకు ఆ పార్టీని అడ్రస్ లేకుండా పోతోంది.
ఎగ్జిట్ పోల్స్ సైతం ఇవే వెల్లడించాయి. వాటి అంచనాలు తలకిందులు చేస్తూ ఆప్ భారీ సీట్లను కైవసం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది. సిద్దూ , చన్నీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Also Read : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం