Punjab Election Results : ఆప్ విజ‌యం ప్ర‌ముఖులు ప‌రాజ‌యం

చ‌న్నీ..సిద్దూ..అమ‌రీంద‌ర్ సింగ్..బాద‌ల్

Punjab Election Results : పంజాబ్ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తూ శాసిస్తూ వ‌చ్చిన అతిర‌థ మ‌హారథులంతా మ‌ట్టి క‌రిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ(Punjab Election Results) దెబ్బ‌కు త‌మ స్థానాల‌ను కోల్పోయారు.

సామాన్యులు సంధించిన అస్త్రాల‌కు త‌ల‌వంచారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి ఆప్(Punjab Election Results) కొట్టిన దెబ్బ‌కు ఠారెత్తారు. ఇప్ప‌టికే భ‌గ‌వంత్ మాన్ సీఎం అభ్య‌ర్థిగా ఎంపిక కానున్నారు.

ఊహించ‌ని దానికంటే ఎక్కువ సీట్లు కొల్ల‌గొడుతూ దూసుకు పోతోంది ఆప్.

ఈ త‌రుణంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమ‌ణి అకాలీద‌ళ్ , కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్లు సైతం ఓట‌మి పాల‌య్యారు.

కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ త‌న కంచుకోట‌గా భావించే పాటియాలాలో ఆప్ అభ్య‌ర్థి చేతిలో 19 వేల 873 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పొందారు.

చ‌మ్ కౌర్ సాహిబ్ , బదౌర్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేసిన సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ రెండింట్లోనూ ఓడి పోయారు.

అమృత్ స‌ర్ ఈస్ట్ నుంచి బ‌రిలోకి దిగిన న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ, బిక్ర‌మ్ మ‌జిథియా సైతం ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు.

చ‌న్నీపై 57 వేల ఓట్ల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు. చ‌మ్ కౌర్ లో 4 వేల ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు.

ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును తాము శిర‌సా వ‌హిస్తున్నామ‌ని అన్నారు మాజీ సీఎం అమ‌రీందర్ సింగ్ , పీసీసీ చీఫ్ సిద్దూ. మ‌జితియా అమృత్ స‌ర్ తూర్పు నుంచి ఆప్ కు చెందిన జీవ‌న్ జ్యోతి కౌర్ చేతిలో ఓట‌మి పాల‌యాయ‌రు.

కౌర కు 34 వేల 257 ఓట్లు రాగా సిద్దూకు 29 వేల 128 ఓట్లు వ‌చ్చాయి. మ‌జిథియాకు 22 వేల 431 ఓట్లు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఆప్ సీఎం అభ్య‌ర్థి భ‌గ‌వంత్ మాన్ మాట్లాడారు.

ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల్లో ఉన్న పంజాబీల‌కు ధ‌న్య‌వాదాలు. మీరు చీపురు విస‌ర‌డం ద్వారా మీ వంతు పాత్ర పోషించార‌ని చెప్పారు.

Also Read : ఆప్ దెబ్బ‌కు కెప్టెన్ అవుట్

Leave A Reply

Your Email Id will not be published!