Sabitha Indra Reddy : గతంలో ప్రభుత్వాలు విద్యను ఒక సామాజిక బాధ్యతగా చూసేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. విద్య వ్యాపారంగా మారి పోయింది. ర్యాంకుల ప్రాతిపదికన జనాన్ని మెస్మరైజ్ చేస్తున్నారు.
శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యను ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చేసింది. తెలంగాణ ఉద్యమాని కంటే ముందు ఆ సంస్థలపై నినదించిన వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయి పోయారు.
తాజాగా ఎన్నారైలు రండి మీ రుణం తీర్చుకోమంటూ పిలుపునిస్తోంది ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా విద్యా శాఖ మంత్రి (Sabitha Indra Reddy)కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కారు బడులకు రూ. 2 లక్షలు విరాళం ఇస్తే స్కూల్ నిర్వహణ కమిటీలో సభ్యత్వం ఇస్తామని తెలిపింది.
అంతే కాదు రూ. 25 లక్షలు ఇస్తే ప్రాథమిక బడులకు, రూ. 50 లక్షలు ఇస్తే ప్రాథమికోన్నత స్కూళ్లకు ,రూ. కోటి ఇస్తే ఉన్నత పాఠశాలలకు దాతల పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ఇక కొన్నేళ్ల నుంచి నిర్వహించకుండా ఉన్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు – టెట్ నిర్వహించాలని సీఎం తెలిపారని త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.
అంతే కాకుండా యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను సైతం భర్తీ చేస్తామన్నారు మంత్రి. మన ఊరు మన బడి కింద వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశ పెడుతున్నామన్నారు.
ఇందు కోసం టీచర్లకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇస్తామన్నారు.
Also Read : పోలీసు అకాడెమీలో పోస్టులు