Delhi Budget 2022 : ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల జాబ్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీలో ఎనిమిదో బడ్జెట్ (Delhi Budget 2022)ను ప్రవేశ పెట్టారు.
ఈ సందర్బంగా రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. 2022-23 సంవత్సరానికి గాను రూ. 75 వేల 800 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
2014-15 బడ్జెట్ తో చూసుకుంటే ఇది ఎక్కువేనని చెప్పక తప్పదు. ఈ బడ్జెట్ ను రోజ్ గార్ బడ్జెట్ గా అభివర్ణించారు సిసోడియా. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం సామాన్యులు, పేదలు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టామన్నారు.
ఇప్పటి వరకు తాము అసెంబ్లీ వేదికగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని వెల్లడించారు. మా ప్రభుత్వం ఏం చెప్పామో దానిని నెరవేర్చడం జరిగిందన్నారు సిసోడియా. విద్య, వైద్యంకు ప్రయారిటీ ఇచ్చామన్నారు.
ప్రతి ఒక్కరు చదువుకునేలా పాఠశాలలు, కాలేజీలలో వసతులు ఏర్పాటు చేశామన్నారు. అందరికీ విద్యుత్ అందుబాటులోకి తీసుకు వచ్చామని వెల్లడించారు.
అంతే కాకుండా మెట్రో సర్వీసులు కూడా విస్తరించడం జరిగిందన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో ఆప్ సర్కార్ ఢిల్లీలో లక్షా 70 వేలకు పైగా యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించామన్నారు.
ఓటర్ కార్డుతో అనుసంధానం చేస్తూ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : మోదీ నిర్వాకం స్టాండింగ్ కమిటీ ఆగ్రహం