Delhi Budget 2022 : ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సర్కార్ దేశంలో ఎక్కడా లేని రీతిలో విద్యా రంగంపై ఫోకస్ పెట్టింది. విద్యాభివృద్ధి కోసం గత బడ్జెట్(Delhi Budget 2022 )లో రూ. 16, 377 కోట్లు కేటాయించింది. ఈసారి కొంచెం తగ్గినా సంచలన నిర్ణయం తీసుకుంది.
నిరాశ్రయులు, అనాధ పిల్లల కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందు కోసం వీరికోసం ప్రత్యేకంగా బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఇందులో భాగంగా 2022-23 సంవత్సరం బడ్జెట్ లో రూ. 10 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది ఆప్ ప్రభుత్వం. మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో రూ. 75, 800 కోట్లు కాగా ఇందులో 22 శాతం విద్యా రంగానికి అత్యధికంగా కేటాయించారు.
పాఠశాలల్లో సైన్స్ మ్యూజియం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మనీష్ సిసోడియా. ఈసారి బడ్జెట్ (Delhi Budget 2022 )లో రూ. 14, 412 కోట్లు కేటాయించామన్నారు. మూల ధనం ఖర్చు కింద రూ. 1, 866 కోట్లు ఉన్నాయని తెలిపారు.
పిల్లల ప్రాథమిక విద్య కోసం అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే పాక్షికంగా విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆహారం, నివాసం వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉంటేనే నాణ్యమైన విద్య సాధ్యం కాదన్నారు. నిరాశ్రయులైన పిల్లల కోసం ఆధునిక సౌకర్యాలతో బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
పిల్లలు ఓటు బ్యాంకు కాదని అందుకే కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఒకవేళ వారు ఓటు బ్యాంకు అయి ఉంటే కేంద్రం పట్టించుకునేదని ఆరోపించారు.
Also Read : బెంగాల్ లో ఎమర్జెన్సీ ప్రకటించండి