Bharath Bandh : భారత బంద్ ప్రభావం సోమ, మంగళవారాలలో ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కార్ గంప గుత్తగా అమ్మకానికి పెట్టింది.
చాలా వాటికి లీజుకు ఇచ్చే పనిలో ఉంది. దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులను సైతం ప్రైవేటీకరించే పనిలో పడింది మోదీ ప్రభుత్వం. నిస్సిగ్గుగా ఎలాంటి తొట్టు పాటు లేకుండా మోదీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి.
తీవ్రంగా నిరసిస్తున్నాయి. జాతీయ వాదం, భారతీయత, హిందూ ధర్మం అని నిత్యం నీతి సూత్రాలు వల్లించే ఈ ప్రధాని ఇప్పుడు కొంత మంది తనకు అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టే పనిలో పడ్డాడు.
దేశంలోని ప్రధాన వనరులన్నింటిని అంబానీ, అదానీ, టాటాలకు బదలాయించేందుకు మాత్రమే పని చేస్తున్నాడని ఆరోపించాయి విపక్షాలు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విశిష్ట సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులపై కన్ను పడింది మోదీ, అమిత్ షాకు.
ఇంకేం ఇప్పటికే సహకార బ్యాంకులలో మూలుగుతున్న కోట్లను కొల్లగొట్టేందుకు ఏకంగా షా ఓ శాఖనే క్రియేట్ చేశారు. ఆ శాఖ ఇప్పుడు ఆయన వద్ద నే పెట్టుకున్నారు.
దీంతో భారత్ బంద్ కారణంగా బ్యాంకింగ్ సేవలకు ఈనెల 28, 29 తేదీలలో అంతరాయం కావచ్చంటూ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
భారత్ బంద్(Bharath Bandh )లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ లు పాల్గొంటాయని ఇప్పటికే ప్రకటించాయి.
Also Read : పంజాబ్ ప్రభుత్వం రైతుల కోసం