RGV : ‘ఆర్ఆర్ఆర్’ ను మెచ్చుకున్న ఆర్జీవీ

త్రిబుల్ ఆర్ చ‌రిత్రాత్మ‌కం

RGV  : భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో అత్యంత వివాదాస్ప‌ద‌మైన ద‌ర్శ‌కుడిగా పేరొందిన ఏకైక వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న నిత్యం వార్త‌ల్లో ఉంటారు. ప్ర‌తి దానిని ఏకి పారేస్తారు.

సామాన్యంగా ఆయ‌న ఎవ‌రినీ ఒక ప‌ట్టాన యాక్సెప్ట్ చేయ‌రు. చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. పూర్తి ఇండిపెండెంట్ మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఈ దిగ్గజ ద‌ర్శ‌కుడు ఎవ‌రికీ కితాబు ఇవ్వ‌డు.

ఆయ‌న ఇచ్చాడంటే అది ఓ సెన్సేష‌న్. ఇప్పుడు ఆర్జీవీ (RGV )చేసిన ట్వీట్ సంచ‌ల‌నం క‌లిగించింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా పొగిడింది ఎవ‌రినో కాదు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న ఆర్ఆర్ఆర్ ద‌ర్శ‌కుడు ఎస్. ఎస్. రాజ‌మౌళిని.

ఈ మూవీపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఏకంగా రాజ‌మౌళికి కితాబు ఇచ్చారు ఆర్జీవి. ఈనెల 25న ఆర్ఆర్ఆర్ విడుద‌లైంది ప్ర‌పంచ వ్యాప్తంగా. ఇప్ప‌టికే ఫ‌స్ట్ డే లోనే రూ. 257 కోట్లు సాధించి చ‌రిత్ర సృష్టించింది.

రెండో రోజు కూడా ఇదే వ‌సూళ్ల‌ను సాధిస్తూ ముందుకు వెళుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగ‌ర్ తార‌క్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఆలియా భ‌ట్ , అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించారు.

ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు ఎంఎం కీర‌వాణి. సినిమాను చూసిన వారంతా ఆహా అంటున్నారు. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియాలో చెబుతున్నారు.

ఆర్ఆర్ఆర్ ను సెల‌బ్రెటీలు, ద‌ర్శ‌కులు, ఇత‌ర రంగాల‌కు చెందిన వారు బాగుంద‌ని పేర్కొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ బాహుబ‌లి మూవీ చరిత్ర అయితే ఆర్ఆర్ఆర్ మూవీ చ‌రిత్రాత్మ‌కం అని పేర్కొన్నారు.

Also Read : స్వ‌ర భాస్క‌ర్ ట్వీట్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!