Imran Khan : పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. అవిశ్వాస తీర్మానం పరీక్షను ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ప్రతిపక్ష పీఎంఎల్ – ఎన్ చీఫ్ షెహబాజ్ షరీఫ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఈ మేరకు షరీఫ్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంకు సభ ఆమోదించింది. దీంతో స్పీకర్ కూడా ఓకే చెప్పడంతో పీఎం విషమ పరీక్షను ఎదుర్కొంటోంది.
ఈ సందర్బంగా షరీఫ్ మాట్లాడారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ప్రజల విశ్వాసాన్నే కాదు సభ్యుల నమ్మకాన్ని కోల్పోయారని ఆరోపించారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం ఇమ్రాన్ సర్కార్ పై విశ్వాసం లేదంటూ తీర్మానించింది.
ఇక క్లాజ్ -4 ప్రకారం పాకిస్తాన్ ప్రధాన మంత్రి కి క్షణం కూడా పదవిలో కొనసాగేందుకు అర్హత లేదంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ విపక్షాలపై విరుచుకు పడ్డారు.
గత 30 ఏళ్లుగా పాకిస్తాన్ ను దోచుకు తిన్నారని ఆరోపించారు. జలగల్లా ప్రజల రక్త మాంసాలను పీల్చుకుతిన్నారని, దేశానికి సంబంధించిన సంపదను విదేశాలకు తరలించారని మండిపడ్డారు.
ఈ దేశానికి చెందిన ఆర్మీకి లొంగి ఉండే వాళ్లు కావాలని కానీ ఇమ్రాన్ ఖాన్ ఎప్పటికీ తలవంచడని ప్రకటించాడు. ఈనెల 31కి స్పీకర్ ప్రొరోగ్ చేశారు.
అవిశ్వాసంపై తీర్మానం ప్రవేశ పెట్టాలంటే కనీసం 3 నుంచి 7 రోజుల వరకు గడువు ఉంటుంది. ఈ ఛాన్స్ పూర్తిగా ఉపయోగించు కోవాలని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్రయత్నం చేస్తున్నారు.
ఇమ్రాన్ పార్టీకి చెందిన 25 మంది, మిత్రపక్షాలకు చెందిన 23 మంది గుడ్ బై చెప్పడంతో సంకీర్ణ సర్కార్ ప్రమాదంలో పడింది.
Also Read : రాజీ పడతాడా రాజీనామా చేస్తాడా