Mariyam Nawaz : అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్ని వైపుల నుంచి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిన్నటి దాకా తన వెంట ఉన్న వాళ్లు, పొగిడిన వాళ్లంతా తూలనాడుతున్నారు.
ఈ సందర్భంగా తాను ఆర్మీకి లొంగేది లేదని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్. తన పార్టీకి చెందిన 25 మంది శాసనసభ్యులతో పాటు మిత్ర పక్షాలకు చెందిన 23 మంది శాసనసభ్యులు ఉన్నట్టుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన షరీఫ్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఈ మేరకు స్పీకర్ అనుమతి ఇచ్చారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియా నవాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను ఆమె గత కొంత కాలంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
మిస్టర్ పీఎం నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం ఓటింగ్ రోజున 172 మంది ఎంఎన్ఏలు నీతో ఉంటారో చూడు అంటు మరియా నవాజ్ సవాల్ విసిరారు.
ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపాయి. ఇదిలా ఉండగా ప్రధాని ఇమ్రాన్ పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నిర్వహించిన ర్యాలీ అనంతరం చేపట్టిన ప్రదర్శనలో మరియా నవాజ్(Mariyam Nawaz) ఈ వ్యాఖ్యలు చేశారు.
2018లో పవర్ లోకి వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ అత్యంత కఠినమైన పరీక్ష ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు ఇమ్రాన్ సర్కార్ ను కూల్చి వేస్తామంటూ హెచ్చరించారు.
Also Read : అగ్ని పరీక్షలో ఇమ్రాన్ గట్టెక్కేనా