Imran Khan : ఇమ్రాన్ నిర్ణ‌యం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగం

ప్ర‌జా విశ్వాసం కోల్పోయిన పాకిస్తాన్ పీఎం

Imran Khan : పాకిస్తాన్ లో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొనేందుకు రెడీగా ఉంది. ఇప్ప‌టికే ఆ దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ త‌న‌పై విశ్వాస ప‌రీక్ష‌కు ముందు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని అధికారికంగా పాకిస్తాన్ ప్ర‌భుత్వ రేడియో ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు మిత్ర‌ప‌క్ష పార్టీల‌కు చెందిన అధినేత‌లు కూడా ప్ర‌ధాని ఖాన్ (Imran Khan)అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ప్ర‌త్యేక కేబినెట్ స‌మావేశానికి హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించింది.

ప్ర‌తిప‌క్షాల అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని త‌మ పార్టీ ప్ర‌క‌టించ‌డంతో అధికార సంకీర్ణ భాగ‌స్వామ్య ఎంక్యూఎంపీకి చెందిన ఇద్ద‌రు మంత్రులు రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ త‌రుణంలో పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ఫెడ‌ర‌ల్ క్యాబినేట్ ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. పీఎం ఇన్విటేష‌న్ మేర‌కు దిగువ స‌భ‌లో ఏడుగురు, ఐదుగురు స‌భ్యులున‌న ముత్తాహిదా క్వామీ మూవ్ మెంట్ పాకిస్తాన్ , బ‌లూచిస్తాన్ అవమీ పార్టీ చెందిన శాస‌న స‌భ్య‌ల‌ను తిరిగి గెలిపించుకునే ల‌క్ష్యంతో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు విదేశీ కుట్ర జ‌రిగిందంటూ దీనికి సంబంధించిన బెదిరింపు లేఖ కూడా చ‌ర్చ‌కు రానుంది ఈ మీటింగ్ లో.

ఇదే సంద‌ర్భంలో పీఎం త‌న‌పై ఒత్తిడి పెర‌గ‌డంతో ప్ర‌భుత్వంపై విదేశీ కుట్ర‌కు సంబంధించిన సాక్ష్యాల‌ను క‌లిగి ఉన్న‌టువంటి లేఖ‌ను శుక్ర‌వారం త‌ర్వాత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌కు , ప్ర‌భుత్వ మిత్రుల‌కు చూపుతాన‌ని ప్ర‌క‌టించాడు.

త‌న‌ను ప‌డ‌గొట్టేందుకు కావాల‌ని విప‌క్షాలు, విదేశాల్లో ఉన్న శ‌క్తులు కుట్ర పన్నుతున్నాయంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్.

Also Read : పుతిన్ ను చ‌రిత్ర క్ష‌మించ‌దు

Leave A Reply

Your Email Id will not be published!