JP Nadda : కాంగ్రెస్ కాదది ‘రాహుల్..ప్రియాంక’ పార్టీ
నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు విసిరారు భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా. ఆయన ఆ పార్టీపై గాంధీ ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు జాతీయ పార్టీ అని. దానికంటూ కొన్ని విలువలంటూ ఉండేవని కానీ ఇప్పుడు అది ప్రజలకు దూరంగా ఉందన్నారు.
అన్నా చెల్లెలు (రాహుల్, ప్రియాంక) పార్టీగా మారి పోయిందంటూ ఎద్దేవా చేశారు జేపీ నడ్డా(JP Nadda) . వారిద్దరూ ఇప్పుడు కీలకంగా మారారు. అక్కడ ఎవరికీ స్వతంత్రం అంటూ లేకుండా పోయిందన్నారు.
అందుకే ఆ పార్టీకి చెందిన ప్రముఖులు, కీలక నేతలంతా తమ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు జేపీ నడ్డా. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదు. పూర్తి భారతీయం కూడా కాదన్నారు.
వంశ పారంపర్యంగా వస్తున్న వారిని జాతీయ పార్టీ అని ఎలా పిలుస్తామంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పాలనకు రాజవంశ పార్టీల వల్ల ముప్పు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు న్యూఢిల్లీలో.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా(JP Nadda) . వారికి విలువలు లేవు. ఒకే ఫ్యామిలీ చేతిలో పార్టీ ఉంటే మిగతా వారికి అవకాశాలు ఎలా వస్తాయన్నారు.
వారికి ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం అంటూ ఉండదన్నారు. పుట్టుక ఆధారంగా వివక్షను భారత రాజ్యాంగం నిషేధం విధించింది. కానీ ఆయా పార్టీలలో నాయకత్వం పుట్ట ఆధారంగా నిర్ణయించ బడుతోందని ఆరోపించారు జేపీ నడ్డా.
ప్రతి రాష్ట్రంలో తాము చెడింది కాక వంశ పారంపర్య పార్టీలను ప్రోత్సహిస్తూ వచ్చిందని ధ్వజమెత్తారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని. ప్రాంతీయ పార్టీల అభివృద్ధి వెనుక ఆ పార్టీ ఉందన్నారు.
Also Read : సిద్దూకు షాక్ ఏడాది జైలు శిక్ష