NSE Scam CBI : ఎన్ఎస్ఈ స్కాం పై సీబీఐ ఛార్జిషీట్
మాజీ సిఇఓ, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్
NSE Scam CBI : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎన్ఎస్ఈ స్కాం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(NSE Scam CBI) మరో ముందడుగు వేసింది.
ఈ మేరకు ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఇఓ చిత్రా రామకృష్ణ, మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ లపై సిబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది దర్యాప్తు సంస్థ. ఎన్ఎస్ఈ కో లొకేషన్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ(NSE Scam CBI) శనివారం పలు నగరాల్లోని 10 ప్రదేశాలలలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
ఈ సోదాలు దేశంలోని ముంబై, గాంధీనగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కోల్ కతా లోని ఇతర నగరాల్లో 11 కంటే ఎక్కువ ప్రాంగణాల్లో
బ్రోకర్లను కవర్ చేస్తుంది. 2010 నుండి 2015 వరకు చిత్ర రామకృష్ణ ఎన్ఎస్ఈ వ్యవహారాలు చేపట్టారు.
ఇదే సమయంలో చిత్ర, ఆనంద్ లు పని చేసిన కాలంలో ఎన్ఎస్ఈ అధికారులు కొందరు బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ను మంజూరు చేశారని,
వాటి వల్ల అనవసర, అత్యధిక లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి.
వీటిపై సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 2013లో మాజీ సీఇఓ రవి నారయణ్ తర్వాత ఎం.ఎస్. రామకృష్ణ తన సలహాదారుగా శ్రీ సుబ్రమణియన్ ను నియమించుకున్నారు.
ఆ తర్వాత ఏటా రూ. 4.21 కోట్ల ఫ్యాట్ పే చెక్ తో గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఎలివేట్ అయ్యారని సీబీఐ ఆరోపించింది. ఇదే సమయంలో చిత్ర రామకృష్ణ హిమాలయాల్లో ఉన్న యోగి కి మెయిల్ పంపించడంపై కూడా ఆరా తీసింది.
Also Read : జిలింగో సిఇఓ అంకితి బోస్ పై వేటు