APSRTC MD : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్

త్వ‌ర‌లోనే పే స్కేల్ అమ‌లుకు శ్రీ‌కారం

APSRTC MD : ఓ వైపు తెలంగాణ‌లో ఆర్టీసీ ఉద్యోగులు నానా తంటాలు ప‌డుతుంటే ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ కొత్త పుంత‌లు తొక్కుతోంది.

ఆ రాష్ట్ర సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను కొలువు తీరాక ఆర్టీసీ ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచారు. అంతే కాదు వారిని కూడా ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఎలాంటి వేధింపులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో ఆర్టీసీ ఉద్యోగులంద‌రికీ పే స్కేల్ వ‌ర్తింప చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్(APSRTC MD) ద్వార‌కా తిరుమ‌ల్ రావు వెల్ల‌డించారు.

ఎండీ తిరుప‌తి, అలిపిరి, మంగ‌ళ‌గిరి, చంద్ర‌గిరి బ‌స్టాండ్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ద్వార‌కా తిరుమ‌ల రావు మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులంద‌రినీ ప్ర‌భుత్వం లో ఇప్ప‌టికే విలీనం చేశార‌ని చెప్పారు.

వారంద‌రికీ నూత‌న పే స్కేలు విధానం అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. కొత్త‌గా 100 ఏసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తీసుకు వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు జూలై 1న తొలి బ‌స్సు అలిపిరి డిపోకు చేరుకుంటుంద‌న్నారు.

మిగ‌తా బ‌స్సుల‌ను తిరుప‌తికి తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల ఘాట్ రోడ్డు కోసం 30 నుంచి 50 బ‌స్సులు న‌డిపిస్తామ‌న్నారు.

రేణిగుంట‌, ఎయిర్ పోర్టు, నెల్లూరు, ప్ర‌ముఖ దేవాల‌యాలు ఉన్న ప్రాంతాల‌కు మ‌రో 50 బ్సులు కేటాయిస్తామ‌ని చెప్పారు ద్వారకా తిరుమ‌ల‌రావు.

ఇక బ‌స్సుల‌కు సంబంధించి చార్జింగ్ పాయింట్లు, విద్యుత్ చార్జీలు, కండ‌క్ట‌ర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటుంద‌న్నారు. డ్రైవ‌ర్లు, బ‌స్సుల మ‌ర‌మ్మ‌తులు మాత్రం య‌జ‌మానులే చూసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు ఎండీ(APSRTC MD).

Also Read : ప్ర‌ధానితో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!