YS Jagan : ఏపీ రైతులకు భారీ ఎత్తున రుణాలు – సీఎం
రూ. 92,000 వేల కోట్ల మేరకు ఇచ్చేందుకు శ్రీకారం
YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) రైతులకు మరింత భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) లను ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి భారీ ఎత్తున పంటలు పండించేందుకు కోసం ఏకంగా ఏపీ ప్రభుత్వం రూ. 92,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఇక నుంచి పెట్టుబడి కోసం ఎలాంటి ఇబ్బందులనేవీ ఉండవు రైతులకు.
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు మేలు చేకూర్చేలా, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ మేరకు ఈ ఏడాదికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఇందులో భాగంగా ఖరీఫ్ లో పంట రుణాల లక్ష్యం రూ. 71,000 కోట్లు నిర్ణయించారు.
అంతే కాకుండా వ్యవసాయ టర్మ్ రుణాల కింద మరో రూ. 21,000 కోట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వీటితో పాటు 10.02 లక్షల టన్నుల ఎరువులు సిద్దంగా ఉంచారు.
రాష్ట్రంలో కౌలు రైతులకు 5.8 లక్షల సీసీఆర్ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ వ్యవసాయ శాఖ.
జిల్లాల వారీగా బ్యాంకర్ల కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి నిర్దేశించిన లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందించాలని సీఎం జగన్ రెడ్డి(YS Jagan) ఆదేశాలు జారీ చేశారు.
Also Read : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఖుష్ కబర్