YS Jagan : రైతుల సంక్షేమం ఏపీ స‌ర్కార్ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

YS Jagan : ఆరుగాలం పండించే రైతుల సంక్షేమమే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. వైఎస్సార్ యంత్ర సేవా ప‌థ‌కం కింద 3,800 ట్రాక్ట‌ర్లు , 320 హార్వెస్ట‌ర్లు పంపిణీ చేశారు గుంటూరులో.

5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాల‌కు రూ. 175 కోట్ల స‌బ్సిడీని మంజూరు చేశారు సీఎం(YS Jagan). గ‌తంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ప‌డ్డారు. సాగు చేయాలంటే రుణాలు చేయాల్సిన ప‌రిస్థితి. వారి క‌ష్టాల‌ను ద‌గ్గ‌రుండి చూశాను.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో రైతుల బాధ‌లు విన్నాను. అందుకే వారికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేశామ‌న్నారు.

అంతే కాదు విత్త‌నాల ద‌గ్గ‌ర నుంచి పెట్టుబ‌డి పెట్టేంత దాకా రైతుల‌కు అన్ని వేళ‌లా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే అండ‌గా ఉంటుంద‌న్నారు. దీని వ‌ల్ల త‌మ పంటకు న‌ష్టం వాటిల్లే స‌మ‌స్య అంటూ ఉండ‌ద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10, 750 రైతు భ‌రోసా కేంద్రాల‌లో రైతుల‌కు కావాల్సిన ప‌నిముట్ల‌న్నీ అందుబాటులో ఉంచామ‌ని చెప్పారు. 40 శాతం రాయితీ ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

50 శాతం రుణాలు త‌క్కువ వ‌డ్డీకే బ్యాంకుల‌తో మాట్లాడి మంజూరు చేయిస్తున్నామ‌ని తెలిపారు సీఎం. రైతులు గ్రూపులుగా ఏర్ప‌డి కేవ‌లం 10 శాతం డ‌బ్బులు క‌డితే చాలు ఇక నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చ‌న్నారు.

రైతుల‌కు మేలు చేకూర్చేందుకు గాను రూ. 2016 కోట్ల‌తో ప్ర‌తి ఆర్బీకే సెంట‌ర్ లో రూ. 15 ల‌క్ష‌ల విలువ గ‌ల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు సీఎం(YS Jagan).

ఎక్కువ‌గా సాగు చేసే 20 జిల్లాల్లో 1615 క్ల‌స్ట‌ర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

Also Read : 1,433 పోస్టుల‌కు ఆర్థిక శాఖ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!