KTR : పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్
ఆటో మొబైల్ హబ్ గా మారనున్న నగరం
KTR : పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ మారింది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి. ఐటీ, ఫార్మా, అగ్రి, విమెన్ , రియాల్టీ హబ్ గా మారింది.
ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లనే ఇదంతా సాధ్యమైందన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). ఇక రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఆటో మొబైల్ రంగంలో కూడా టాప్ లో నిలుస్తుందన్న నమ్మకం తనకు కలుగుతోందన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో టీఎస్ఐపాస్ పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు. దీని వల్ల పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు.
ఇలాంటి సిస్టం ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ పెట్టుబడి నగరాల్లో మన సిటీ ఏడో స్థానంలో ఉందన్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనువైన వాతవరణం, మౌలిక వసతులు కలిగి ఉన్న ఏకైక ప్రాంతం హైదరాబాద్ అని చెప్పారు. గతంలో ఐటీ అంటే బెంగళూరు అని చెప్పే వారని, కానీ సీన్ మారిందన్నారు.
ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ అని పలవరిస్తున్నారని చెప్పారు కేటీఆర్(KTR). అమెరికా లోని ఉత్తర కరోలినా రాష్ట్రానికి చెందిన అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ కోకాపేటలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
వరల్డ్ లోనే అతి పెద్ద ఆటో పార్ట్స్ కు సాఫ్ట్ వేర్ ను అందించే అతి పెద్ద సంస్థ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కు రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి(KTR).
Also Read : ఏఐ ఇంజనీర్ పై గూగుల్ వేటు