Mayawati : ఒకే వర్గాన్ని టార్గెట్ చేస్తే ఎలా – మాయావతి
బోల్డోజర్లతో భయాందోళన సృష్టించడంపై ఫైర్
Mayawati : యూపీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ సీఎం మాయవతి. ఆమె సీఎం యోగి ఆదిత్యానాథ్ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందన్నారు. కేవలం ఒకే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుండడం మంచి పద్దతి కాదన్నారు. బుల్ డోజర్లను ఉపయోగించి , అధికారం ఉంది కదా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు మాయావతి(Mayawati).
నిరసనలు, ఆందోళనలు చేపట్టడం అన్నది ప్రాథమిక హక్కు. ఎవరు విద్వేషాలను రెచ్చగొడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. మీరే కామెంట్స్ చేయడం, ఆపై మీరే కేసులు నమోదు చేస్తే ఎలా అని మాయావతి ప్రశ్నించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు. ఇళ్లను కూల్చి వేయడం ద్వారా ఏం సాధిద్దామని సీఎం అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ట్విట్టర్ వేదికగా మాయావతి యోగి ఆదిత్యానాథ్ పై నిప్పులు చెరిగారు.
ఇలాంటి లోపభూయిష్ట చర్యలను ఇకనైనా సీఎం మాను కోవాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం తో పాటు కోర్టు జడ్జిగా మారి పోయారన్న అనుమానం కలుగుతోందన్నారు.
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతినేందుకు కారకులైన బీజేపీకి చెందిన నూపుర శర్మ, నవీన్ కుమార జిందాల్ లను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ మాయావతి(Mayawati) ప్రశ్నించారు.
తప్పులు మీరు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే ఎలా అని నిలదీశారు. రూల్స్ పాటించకుండా బోల్డోజర్లను ప్రయోగించడం వల్ల అమాయకులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
Also Read : యూపీలో కూల్చివేతలపై ఓవైసీ ఫైర్