Rahul Gandhi ED : ఈడీ ముందుకు మరోసారి రాహుల్ గాంధీ
రెండో రోజు కూడా రావాలని ఈడీ ఆదేశం
Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi ED) రెండో రోజు మంగళవారం కూడా హాజరు కానున్నారు.
ఆయనతో పాటు తల్లి సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది. కానీ ఆమెకు కరోనా సోకడంతో హాజరు కాలేక పోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు ఎదుట హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఏఐసీసీ కార్యాలయం నుంచి కార్యాలయం వరకు రాహుల్ కాలినడకన బయలు దేరారు.
దారి పొడవునా కాంగ్రెస పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీఎంలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదే విషయంపై సత్యా గ్రహ్ యాత్ర చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.
పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ ఆఫీసు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా నిన్న ఉదయం 11 .10 గంటల ప్రాంతంలో ఈడీ ముందు హాజరయ్యారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ED).
ఆయనను ఈడీ 10 గంటలకు పైగా ప్రశ్నించింది. మరోసారి ఈ కేసుకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదని ఇవాళ కూడా హాజరు కావాలని కోరింది. దీంతో రాహుల్ మరోసారి ఈడీ ముందుకు వెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా ఈ పత్రికకు సంబంధించిన కేసు ను మూసి వేశారు. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సీబీఐకి ఫిర్యాదు చేశారు.
దీనిని ఆధారంగా చేసుకుని ఈడీ కేసు రీ ఓపెన్ చేసింది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేతలు పి. చిదంబరం, రణ్ దీప్ సూర్జే వాలా, దిగ్విజయ్ సింగ్ , అశోక్ గెహ్లాట్.
Also Read : ఖాకీల నిర్వాకం చిదంబరంకు గాయం
Rahul Gandhi to appear before ED again in National Herald case
Track latest news updates here https://t.co/YJaALIpggN pic.twitter.com/6UUp4gm3er— Economic Times (@EconomicTimes) June 14, 2022