5G Spectrum Auction : జూలై 26న 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం

4జీకంటే 10 రెట్లు వేగవంతం

5G Spectrum Auction : ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర స‌ర్కార్. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వ‌స్తున్న 5జీ సేవ‌లు అందుబాటులోకి త్వ‌ర‌లో రానున్నాయి.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 4జీ స‌ర్వీసెస్ మాత్రమే ఉంది. ఇదిలా ఉండ‌గా 5జీ గ‌నుక వ‌స్తే 10 రెట్లు స్పీడ్ తో రానుంది. మ‌రి ఇది రావాలంటే స్పెక్ట్ర‌మ్ వేలం వేయాల్సి ఉంది. దీని ద్వారా కోట్లాది రూపాయ‌లు మోదీ ప్ర‌భుత్వానికి రానున్నాయి.

ఈ మేర‌కు స్పెక్ట్ర‌మ్ వేలానికి క్యాబినెట్ బుధ‌వారం ఆమోదం తెలిపింది. కాగా 5జీ(5G Spectrum Auction) సేవ‌ల బిడ్డ‌ర్ ల‌కు స్పెక్ట్ర‌మ్ ను కేటాయించే వేలాన్ని నిర్వ‌హించాల‌నే టెలిక‌మ్యూనిషన్స్ శాఖ ప్ర‌తిపాద‌న‌ను పీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది.

జూలై చివ‌రి నాటికి 20 సంవ‌త్స‌రాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 ఎంహెచ్ జెడ్ వేలం వేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు కేంద్ర మంత్రి వైష్ణ‌వ్ . ప్రైవేట్ 5జీ నెట్ వ‌ర్క్ ల‌ను ఆప‌రేట్ చేసేందుకు మార్గాన్ని సుగ‌మం చేసింది.

సంస్థ‌ల‌కు నేరుగా ఎయిర్ వేవ్ ల‌ను కేటాయించే ప్ర‌తిపాద‌న‌కు ప‌చ్చ జెండా ఊపింది. జూలై 26న స్పెక్ట్ర‌మ్ వేలాన్ని నిర్వ‌హించ‌నుంది.

ఇదిలా ఉండ‌గా దేశంలోని మూడు ముఖ్య టెలికాం కంపెనీలు రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్ , వోడా ఫోన్ ఐడియా పాల్గంటాయ‌ని భావిస్తున్నారు.

5జీ(5G Spectrum Auction) సేవ‌లకు సంబంధించి స్పెక్ట్ర‌మ్ వేలం భార‌త దేశ టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకు రానున్నాయి. మొత్తంగా ఈ వేలం పాట ద్వారా భారీ ఆదాయం స‌మ‌కూర‌డం ఖాయం.

Also Read : క‌నెక్ష‌న్ తీసుకోవాలంటే క‌న్నీళ్లే

Leave A Reply

Your Email Id will not be published!