Agnipath MLA Attack : రైళ్ల ధ్వంసం ఎమ్మెల్వే వాహనంపై దాడి
అగ్నిపథకం స్కీం రాజేసిన మంట
Agnipath MLA Attack : కేంద్ర సర్కార్ ప్రకటించిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. సాయుధ దళాలలో కేవలం నాలుగు సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్దతిన ఎంపిక చేస్తామని మోదీ ప్రకటించారు.
ఆర్మీపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువత తీవ్ర ఆవేశానికి లోనైంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. బీహార్ రాష్ట్రం ప్రస్తుతం నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది.
దాడులకు పాల్పడడం, రైళ్లను అడ్డుకోవడం, ట్రాఫిక్ ను నిలవరించడం, రాళ్లకు దిగడంతో పరిస్థితి గతి తప్పుతోంది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.
ఇంకో వైపు ఆగి ఉన్న ట్రైన్ కు చెందిన బోగికి మంట పెట్టారు. బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఆందోళనలు 15 జిల్లాల్లో మిన్నంటాయి. ఛప్రా కైమూర్ లో 4 రైళ్లను తగుల బెట్టారు.
భారతీయ జనతా పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఫర్నీచర్ ను చిందర వందర చేశారు. 12 రైళ్లను ధ్వంసం చేశారు. ఛప్రా లోనే 3 రైళ్లను తగులబెట్టారు.
ఆగ్రహించిన యువత కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైళ్ల రాక పోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. అర్రహ్ లో పరిస్థితి చేయి దాటి పోయింది.
ఇక నవాడాలో వారిస్లిగంజ్ ఎమ్మెల్యే అరుణా దేవి పై ఆందోళనకారులు దాడి చేశారు. దాడి సమయంలో ఎమ్మెల్యే(Agnipath MLA Attack) కారులో ఉన్నారు. ఆమె తృటిలో తప్పించుకున్నారు.
ఒక్కసారిగా 20 మంది యువకులు ఈ దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఈ మేరకు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : అగ్నిపథ్ పై ఆగ్రహం బీజేపీ ఆఫీసు ధ్వంసం