Swapna Suresh CM : కేరళ సీఎంపై స్వప్న షాకింగ్ కామెంట్స్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సాయం కోరారు
Swapna Suresh CM : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు. ఈ కేసులో ప్రధాన అభియోగం ప్రస్తుతం సీఎం పినరయి విజయన్ పై ఉంది.
తాజాగా ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో స్వప్న సురేష్(Swapna Suresh CM) షాకింగ్ ఆరోపణలు చేశారు. షార్జా పాలకుడిని సందర్శించేందుకు సీఎం సహాయం కోరారంటూ ఆమె ఆరోపించారు.
ఎమిరేట్ లో ఐటీ వ్యాపారం ప్రారంభించేందుకు తన కుమార్తె ప్రయత్నం కోసం సీఎం(CM) పినరయి విజయన్ 2017 సెప్టెంబర్ లో షార్జాను సందర్శించారని తెలిపారు.
ఆయన సాయం కోరారని కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్న సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు తెలియదని పినరయి విజయన్ చేసిన వాదనపై స్వప్న సురేష్(Swapna Suresh CM) స్పందించారు. సీఎం తన అధికారిక నివాసంలో ఉన్న విషయాన్ని మీడియా ద్వారా త్వరలో గుర్తు చేస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టులో ఆమె దాఖలుచేసిన అఫిడవిట్ లో షార్జా పాలకుడు కేరళ సీఎం విజయన్ చర్చలు జరిపారంటూ ఆరోపించారు.
షార్జాలో ఐటీ వెంచర ను ప్రారంభించేందుకు సీఎం కూతురు వీణా విజయన్ ఆసక్తి చూపారని ఇందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
సీఎం క్లిఫ్ హౌస్ ను సందర్శించారు. కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఐటీ ప్రాజెక్టును వదిలి పెట్టారు. ఆ సమావేశంలో మాజీ చీఫ్ సెక్రటరీ నళిని నెట్టో , సిఎంఓ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకర్ కూడా ఉన్నారని తెలిపారు స్వప్న సురేష్.
Also Read : రైళ్ల ధ్వంసం ఎమ్మెల్వే వాహనంపై దాడి