Nupur Sharma : నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు
దొరకని మేడం కోసం సెర్చింగ్ ముమ్మరం
Nupur Sharma : భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీకి చెందిన నూపుర్ శర్మ(Nupur Sharma) కనిపించడం లేదట. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో అల్లర్లు, ఆందోళనలకు కారణమైంది.
ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై నూపుర్ శర్మ కామెంట్స్ పై 51 ముస్లిం దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆపై భారత దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఏకంగా ఐక్య రాజ్య సమితి చీఫ్ కు లేఖ రాశాయి.
దీనిపై మోదీ ప్రభుత్వం డ్యామేజ్ కాకుండా నానా తంటాలు పడింది. ఆయా దేశాలు రాయబారులను పిలిపించి అభ్యంతరం తెలిపాయి.
అయితే ఇండియా మాత్రం అవి తాము చేసినవి కాదని, వ్యక్తిగతమని స్పష్టం చేసింది. అయినా నిరసనలు ఆగలేదు. ఇప్పటికే వందలాది మందిపై కేసులు నమోదు చేశారు.
మరో వైపు నూపుర్ శర్మకు ముంబై, కోల్ కతా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తమ ముందు హాజరు కావాలని కోరారు. కానీ గత ఆరు రోజుల నుంచి ఆమె కనిపించడం లేదని పోలీసులు చెబుతుండడం విశేషం.
నూపుర్ శర్మను పట్టుకునేందుకు ఇరు రాష్ట్రాల ఖాకీలు వెదుకుతున్నారు. ఆమె జాడ తెలుసుకునేందుకు టీంలు యత్నిస్తున్నాయి.
ఈ తరుణంలో నూపుర్ శర్మ(Nupur Sharma) తో పాటు మరో బీజేపీ ఢిల్లీ మీడియా ఇన్ చార్జిగా ఉన్న నవీన్ కుమార్ జిందాల్ ను కూడా పార్టీ బహిష్కరించింది.
పలు చోట్ల నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులు అందాయి. మొత్తంగా నూపుర శర్మ, నవీన్ జిందాల్ లు ఈ దేశంలో హాట్ టాపిక్ గా మారారు.
Also Read : బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కమిటీ డిక్లేర్