Revanth Reddy Arrest : బాసరలో రేవంత్ రెడ్డి అరెస్ట్
గోడ దూకి ప్రవేశించిన టీపీసీసీ చీఫ్
Revanth Reddy Arrest : బాసర త్రిబుల్ ఐటీలో పరిస్థితి ఎప్పటి లాగానే ఉంది. ఆరు వేల మంది విద్యార్థులు రోడ్డెక్కారు. ఇవాళ వారిని పరామర్శించేందుకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.
ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసుల కళ్లు గప్పి బాసర ఐటీ లోకి ప్రవేశించారు. దీంతో ఊహించని షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy Arrest) గోడ దూకి లోపలికి వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఆయన బాసరకు చేరుకున్నారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గోడ దూకిన రేవంత్ రెడ్డి విద్యార్థుల వద్దకు చేరుకున్నారు.
దీంతో బాసర వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో బాధిత విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy Arrest) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆయనను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్ట్ ను నిలదీశారు. తాను విద్యార్థుల సమస్యలను తెలుసు కునేందుకు వచ్చానని చెప్పారు.
ఇందులో పోలీసులకు ఎందుకు అభ్యంతరం ఉండాలని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు పిల్లలు నానా తంటాలు పడుతున్నారని, ఈ రోజు వరకు పరిష్కరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యను గాలికి వదిలి వేశారని ఇందుకు సంబంధించి బాసర త్రిబుల్ ఐటీ ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : రాకేశ్ కుటుంబానికి కేసీఆర్ భరోసా