KCR : రాకేశ్ కుటుంబానికి కేసీఆర్ భరోసా
రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా..ఉద్యోగం
KCR : అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగులు నిర్వహించిన నిరసన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైల్వే పోలీసులు ముందస్తు సమాచారం లేకుండానే కాల్పులకు తెగబడ్డారు. పలువురు గాయపడ్డారు.
వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ కాల్పుల ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోన వరగల్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే నిరుద్యోగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ మేరకు ముందస్తుగా రాకేశ్ కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. అతడి ఫ్యామిలీకి రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వం తరపున పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా యువత సంయమనం పాటించాలని సూచించారు. శాంతియుత మార్గాల ద్వారానే నిరసన చేపట్టాలని కోరారు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న నిరసనలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు సీఎం(KCR).
ముందస్తు ఆలోచన లేకుండా, ఎవరితో చర్చించకుండా ఈ స్కీంను తీసుకు వచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేసీఆర్. ఇది మంచి పద్దతి కాదని, పునరాలోచించు కోవాలని సూచించారు.
కేంద్రం తప్పుడు విధానాల వల్లనే రాకేశ్ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం(KCR). ఇక అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్, ఉత్తర ప్రదేశ్ , హర్యానా, మధ్య ప్రదేశ్ , తెలంగాణ, తదితర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
రైళ్లను తగుల బెట్టారు. బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
Also Read : అగ్నిపథ్ స్కీంను రద్దు చేయండి – జయంత్