YS Jagan : విద్యార్థులకు సీఎం జగన్ ఖుష్ కబర్
ప్రతి ఒక్కరికీ ఉచితంగా ట్యాబ్ లు
YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ఖుష్ కబర్ చెప్పారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా కొలువు తీరిన నాటి నుంచి విద్య, వైద్యం, ఉపాధికే ప్రయారిటీ ఇస్తానని ప్రకటించారు.
ఆ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన నాడు నేడు స్కీం దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. ఇందులో ప్రధానంగా నాడు నేడు తో పాటు డిజిటల్ లెర్నింగ్ పై సమీక్ష నిర్వహించారు.
బైజూష్ తో ఒప్పందం మేరకు విద్యార్థులకు కంటెంట్ అందించడంపై ప్రధానంగా చర్చించారు సీఎం(YS Jagan). 8వ తరగతి స్టూడెంట్స్ కు ట్యాబ్ లు అందించాలని సూచించారు.
తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తామని, వాటిలో బైజూస కంటెంట్ ను లోడ్ చేయాలని స్పష్టం చేశారు సీఎం.
దీనికి తగ్గట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్ , ఫీచర్లు కూడా ఉండాలని సూచించారు. వీటిని నిర్దారించిన తర్వాతే ట్యాబ్ లు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
అవి స్టాండర్డ్ గా ఉండాలని ఆ తర్వాత చదివే 9, 10 తరగతులకు కూడా ట్యాబ్ లు రావాలన్నారు. నిర్వహణ ముఖ్యమని, వాటితో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే రిపేర్ చేసే నైపుణ్యం కూడా ఉండాలన్నారు.
Also Read : దేశానికే తలమానికం టీ-హబ్ – కేసీఆర్