TS SSC Results 2022 : పదో తరగతి ఫలితాల్లో బాలికలు టాప్
90 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
TS SSC Results 2022 : తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు (TS SSC Results 2022) రిలీజ్ అయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు.
విచిత్రం ఏమిటంటే మరోసారి బాలికలు సత్తా చాటారు. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా 87.16 శాతం బాలురు పాస్ అయ్యారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే సిద్దపేట జిల్లా 97 శాతం సాధించి మొదటి ప్లేస్ లో నిలిచింది. హైదరాబాద్ 79 శాతం సాధించి చివరి ప్లేస్ తో సరి పెట్టుకుంది. 15 బడుల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదని మంత్రి వెల్లడించారు.
3007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ
ఏడాది 5,09,275 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
వీఈరిలో 99 శాతం మంది హాజరయ్యారు. గత నెల మే 23 నుంచి జూన్ 1వ తేదీ దాకా ఎగ్జామ్స్ జరిగాయి. కరోనా ప్రభావం కారణంగా 2022లో
ఎస్ ఎస్ సి పరీక్షలను 11 పేపర్లకు గాను 6 పేపర్లకు కుదించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మేరకు విద్యా శాఖ పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో సత్తా చాటారు స్టూడెంట్స్ .
ఏకంగా 99.32 శాతం సాధించి రికార్డు సృష్టించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను దాటేశారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లోనూ సత్తా చాటారు. గురుకుల విద్యార్థులు 99.32 శాతం సాధిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 75.68 శాతంతో వెనుకబడ్డారు.
ఇక గురుకులాల పరంగా చూస్తూ ఎస్సీ గురుకులాలు 98.1 శాతం, బీసీ గురుకులాలు 97.47 శాతం, ఎస్టీ గురుకులాలు 95.3 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇక మోడల్ స్కూల్స్ 97.25 శాతం, మైనార్టీ రెసిడెన్షియల్స్ లో 93.73 శాతం, కేజీబీవీ స్కూల్స్ 93.49 శాతం పొందారు. ఇక జిల్లా పరిషత్
స్కూల్స్ లో 80.73 శాతం ఉత్తీర్ణత పొందితే ప్రభుత్వ స్కూళ్లల్లో 75.65 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 91.31 శాతం పొందారు.
Also Read : విద్యార్థులకు సీఎం జగన్ ఖుష్ కబర్