KTR : దేశం అభివృద్దిని విస్మరించిన బడ్జెట్
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
KTR : దేశంలో అపారమైన వనరులు ఉన్నా ఎందుకని అభివృద్ది చెందడం లేదో ప్రతి ఒక్కరు ఆలోచించాలని అన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. దేశ అభివృద్ది కోసం నిధులు కేటాయించినట్లు బడ్జెట్ లో కనిపించడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ కంటే చిన్నదైన సింగపూర్ ఇవాళ వరల్డ్ లోనే టాప్ లో ఉందని , దానిని మనం ఎందుకు అవగాహన చేసుకోలేక పోతున్నామని ప్రశ్నించారు.
ఇకనైనా కేంద్రం తన పనితీరును మార్చుకోవాలని లేక పోతే కష్టమవుతుందని హెచ్చరించారు. పొద్దస్తమానం మతంతో ఎంత కాలం దేశాన్ని పాలిస్తారంటూ కేటీఆర్(KTR) నిలదీశారు.
ఈ దేశంలో కేవలం ఎన్నికల కోసం మాత్రమే ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ప్రజల కోసం పని చేయడం లేదంటూ మండిపడ్డారు మంత్రి. చైనా, జపాన్ లాంటి దేశాలు తక్కువ వనరులు ఉన్నప్పటికీ వరల్డ్ లో అభివృద్దిలో ముందంజలో ఉన్నాయని గుర్తు చేశారు.
ఈ దేశానికి సంబంధించి కొత్త ప్రొడక్ట్ ఎందుకు ఉత్పత్తి కావడం లేదన్నారు కేటీఆర్. భారత్ లో ఆర్థిక అభివృద్ది కంటే ఎక్కువగా పాలిటిక్స్ పై ఫోకస్ పెడతారని అందుకే మనం ఇంకా వెనుకబడి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు .
ప్రపంచంలో ఇప్పటి వరకు గుర్తించ దగిన లేదా గుర్తు పెట్టుకోగలిగిన బ్రాండ్స్ ఏవైనా ఉన్నాయా అని మండిపడ్డారు కేటీఆర్. ఇకనైనా కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ తన పనితీరును మార్చుకోవాలని సూచించారు. లేక పోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
Also Read : బడా బాబుల కోసమే ఈ బడ్జెట్