ఏబీఎన్ ఛాన‌ల్ పై శాస‌న మండ‌లి చైర్మ‌న్ కు ఫిర్యాదు

ఫిర్యాదు చేసిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఎమ్మెల్సీలు

హైద‌రాబాద్ : ఏబీఎన్ ఛాన‌ల్ పై, అందులో ప‌ని చేస్తున్న వెంక‌ట‌కృష్ణ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ త‌క్కెల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ప‌లువురు ఎమ్మెల్సీల‌తో క‌లిసి శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి విన‌తిప‌త్రం స‌మర్పించారు. తాను ఒక ఎమ్మెల్సీని, వారి ఆహ్వానం మేరకు వచ్చిన ఒక అతిథిని అని చూడకుండా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని నన్ను అవమానించడం నా మనసును క‌లిసి వేసింద‌న్నారు. నా పట్ల ఒక యాంకర్ అంత అక్కసుగా మాట్లాడటం ఏం అవసరం అని ప్రశ్నించారు. ఒక అతిథి పట్ల ఇలా ప్రవర్తించడం దుర్మార్గం కాదా అని నిల‌దీశారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.

ఏబీఎన్ డిబేట్‌లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేశామ‌న్నారు. త‌న‌తో పాటు ఎమ్మెల్సీ విప్ విప్ దేశపతి శ్రీనివాస్,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి, కూడా ఉన్నారు. కాగా క్షమాపణ చెప్పాలని లేదంటే డిబేట్ నుండి వెళ్ళిపోవాలని తేల్చి చెప్పిన ఏబీఎన్ అసోసియేట్ ఎడిటర్ వెంకట కృష్ణ . క్షమాపణ చెప్పేది లేదని ఖరాఖండిగా చెప్పిన రవీందర్ రావు. దీంతో గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ రవీందర్ రావు పై మండిప‌డ్డారు . అతన్ని డిబేట్ నుండి కట్ చేయాలని ఛానెల్ సిబ్బందికి ఆదేశించాడు. ఉద్రిక్త పరిస్థితిలో రవీందర్ రావు ను మ్యూట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏబీఎన్ ను బహిష్కరించాలని బీ ఆర్ ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!