Owaisi : పిలుపు లేదు అయినా వెళ్లేది లేదు
సంచలన ప్రకటన చేసిన ఎంపీ ఓవైసీ
Owaisi : ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని, కేంద్రంలో కొలువు తీరిన మోదీ సంకీర్ణ సర్కార్ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
ఈ మేరకు దేశంలోని 22 రాజకీయ పార్టీల చీఫ్ లకు లేఖలు రాశారు. దీనికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు బెంగాల్ సీఎం నుంచి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు ఓవైసీ.
ఒక వేళ పిలిచి ఉంటే తాము వెళ్లి ఉండే వాళ్లం కాదన్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించిందని, ఆ పార్టీ పాల్గొంటే తాము వెళ్లే ప్రసక్తి ఉండదన్నారు.
అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పై ఐక్యంగా పోరాడాలని పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఓవైసీ.
కాంగ్రెస్ ను ఆహ్వానించినంత మాత్రాన తాము వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు ఓవైసీ(Owaisi). నన్ను ఎందుకనో ఆహ్వానించ లేదు సీఎం మమతా బెనర్జీ.
కారణం కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని పిలిచినప్పటికీ మా గురించి చెడుగా మాట్లాడే టీఎంసీ పార్టీ గురించి తాము పట్టించు కోమన్నారు ఓవైసీ(Owaisi) . దానికి అంత సీన్ లేదన్నారు.
ఇదిలా ఉండగా దీదీ కాంగ్రెసేతర సీఎంలకు ఆహ్వానించారు. సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ , నవీన్ పట్నాయక్ , పినరయ్ విజయన్ , ఎంకే స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే ఉన్నారు.
Also Read : ప్రెసిడెంట్ ఎన్నికలపై ఖర్గే కామెంట్స్