Green City Award : హైదరాబాద్ కు అరుదైన పురస్కారం
పచ్చదనంలో గ్రీన్ సిటీ అవార్డు
Green City Award : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు అరుదైన పురస్కారం(Green City Award) లభించింది. పచ్చదనం కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది ఈ నగరం. భాగ్యనగరానికి రెండు అవార్డులు లభించడం విశేషం. వరల్డ్ గ్రీన్ సిటీతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ పురస్కారాలు లభించాయి.
భారత దేశం నుంచి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. రెండు అవార్డులు రావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మహా నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణకొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. కాగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం, పచ్చదనం కార్యక్రమాల వల్ల భాగ్యనగరం పచ్చదనంతో నిండి పోయిందని సీఎం పేర్కొన్నారు.
నగరం పరంగా ఇక్కడ నివసిస్తున్న వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకోవడం మెరుగైన ఫలితాలు వచ్చేలా చేశాయి.
ఓఆర్ఆర్ చుట్టూ పచ్చదనం పెంపుతో హైదరాబాద్ ఈ విభాగంలో ఉత్తమమైనదిగా పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎంట్రీలను అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆహ్వానించింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న హైదరాబాద్ కు ఈ రెండు పురస్కారాలు లభించాయి. ఇదిలా ఉండగా హెచ్ఎండీ టీంను అభినందించారు మంత్రి కేటీఆర్.
Also Read : టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ దర్శన్