NEET SCAM 2022 : నీట్ మెడికల్ సీట్ల స్కాంలో ముందడుగు
ఒక్కో సీటు రూ. 20 లక్షలకు విక్రయం
NEET SCAM 2022 : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆల్ ఇండియా మెడికల్ ఎగ్జామ్ నీట్ రిగ్గింగ్ స్కాంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఒక్కో సీటును రూ. 20 లక్షలకు విక్రయించినట్లు గుర్తించింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.
ఒక్కో సీటును ముందే విక్రయించారని, అందులో రూ. 5 లక్షలు విద్యార్థిని అనురించి నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ) ప్రశ్నా పత్రాన్ని పరిష్కరించిన వ్యక్తికి ఇచ్చారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
మెడికల్ కోర్సుల్లో కన్ ఫర్మ్ డ్ (కచ్చితమైన ) సీట్లను ఆఫర్ చేస్తున్న మల్టీ స్టేట్ రాకెట్ లో ఇప్పటి వరకు ఎనిమిది మందిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. ఈ చీటింగ్ ఆపరేషన్ బీహార్, ఉత్తర ప్రదేశ్ , మహారాష్ట్ర, హర్యానా అంతటా వ్యాపించింది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మున్నా భాయ్ ఎంబీబీఎస్ లో చూపిన విధంగానే ఈ సీట్ల రాకెట్ పక్కా స్కెచ్ వేసినట్లు గుర్తించింది. నిపుణులైన పేపర్ సాల్వ్ చేసే విద్యార్థులను అనుకరిస్తూ భారీ మొత్తంలో సమాధాన పత్రాలు రాశారని విచారణలో వెల్లడైంది.
ఒక్కో సీటుకు ముందే రూ. 20 లక్షలు మాట్లాడుకున్నారని తెలిపింది దర్యాప్తు సంస్థ. ఇక నీట్(NEET SCAM 2022) ప్రశ్నాపత్రాన్ని రూ. 5 లక్షలు విద్యార్థిని వలె నటించి నీట్ ప్రశ్నా పత్రాన్ని పరిష్కరించిన వ్యక్తికి ఇచ్చినట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
మిగిలిన మొత్తాన్ని మధ్యవర్తులు, ఇతరులు పంచుకుంటున్నారని తెలిపింది. సఫ్దర్ జంగ్ కు చెందిన సుశీల్ రంజన్ ప్రధాన సూత్రధారి.
ఈ కేసులో మొత్తం 11 మంది పేర్లు నమోదు కాగా మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది సీబీఐ. ఇందులో కోచింగ్ సంస్థల పాత్ర కూడా ఉందని తెలిపింది.
Also Read : ‘నీట్’ లో ‘బ్రా’ తొలగించారంటూ ఆరోపణ