Shane Warne : క్రికెట్ దిగ్గ‌జానికి క‌న్నీటి వీడ్కోలు

హాజ‌రైన కుటుంబీకులు, క్రికెట‌ర్లు

Shane Warne : ప్రపంచ క్రికెట్ లో స్పిన్ మాంత్రికుడిగా పేరొందిన ఆసిస్ దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ వార్న్(Shane Warne) కు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. ఈనెల 4న థాయ్ లాండ్ లోని త‌న విల్లాలో అక‌స్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు.

ఆయ‌న మృతిపై ప‌లు అనుమానాలు వ‌చ్చినా చివ‌ర‌కు థాయ్ పోలీసుల విచార‌ణ‌లో అదంతా ఒట్టిదేన‌ని తేలింది. ఇవాళ ఈ దిగ్గ‌జ యోధుడికి నివాళులు అర్పించారు.

కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. వీరిలో కుటుంబీకులు, త‌న‌కు ఆప్తులైన క్రికెట‌ర్లు మాత్ర‌మే ఉండ‌డం విశేషం. వార్న్ పేరెంట్స్ కీత్ , బ్రిగెట్ , ముగ్గురు పిల్ల‌లు హాజ‌ర‌య్యారు.

ఇక త‌న‌తో ప్ర‌త్యేక అనుబంధం క‌లిగిన స్టార్ ప్లేయ‌ర్లు మెక్ గ్రాత్ , క్లార్క్ , మార్క్ వా, సైమండ్స్ , టేల‌ర్ , హ్యూస్ , బోర్డ‌ర్ తో పాటు ఇంగ్లండ్ మాజీ స్కిప్ప‌ర్ మైఖేల్ వాన్ ఉన్నారు.

కాగా ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఈనెల 30న వార్న్ అంత్య‌క్రియ‌లు మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో జ‌ర‌గ‌నున్నాయి. ల‌క్ష‌లాది మంది అభిమానులు హాజ‌రు కానున్నారు.

ప్ర‌భుత్వ‌మే ద‌గ్గ‌రుండి జ‌రిపంచ‌నుంది . అధికారిక లాంఛ‌నాల‌తో దిగ్గ‌జ యోధుడికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ఆస్ట్రేలియా దేశ ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు.

ఇది త‌మ దేశ ప్ర‌జ‌ల త‌రపున ఆయ‌న‌కు అర్పించే అరుదైన నివాళిగా పేర్కొన్నారు. ఇక ఆరోజు జ‌రిగే అంతిమ వీడ్కోలు కార్య‌క్ర‌మానికి ఆస్ట్రేలియాతో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు కూడా పాల్గొన‌నున్నారు.

వార్న్ త‌న జీవితంలో 15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ జ‌ట్టుకు త‌న ఆధ్వ‌ర్యంలో టైటిల్ తీసుకు వ‌చ్చాడు.

Also Read : ఏ ప్లేస్ లోనైనా బ్యాటింగ్ చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!