ED MLC Kavitha Twist : ఢిల్లీలో కవిత విచారణపై ట్విస్ట్
ఆరోగ్యం బాగోలేదంటూ ప్రకటన
ED MLC Kavitha Twist : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉండగా ఉన్నట్టుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు ఆరోగ్యం బాగోలేదని తాను హాజరు కాలేనంటూ కొత్త నాటకానికి తెర తీసింది(ED MLC Kavitha Twist). ఆమె తరపు ఆప్ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది సోము భరత్ కవిత తరపున ఈడీ ఆఫీసుకు వెళ్లారు.
తన క్లయింట్ ఆందోళనలో ఉందని, ఆమె ఇక్కడికి రాలేక పోతోందని తెలిపారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా కూడా కవిత తాను అనారోగ్యం కారణంగా హాజరు కాలేనంటూ పేర్కొంది. దీనిపై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం అయినా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ భవన్ లోనే ఉండి పోయింది కవిత.
భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. మరో వైపు ఉదయం 10 గంటలకు తాను మాట్లాడతానంటూ తెలిపింది. నిన్నటి వరకు తాను మహిళా బిల్లు గురించి గొప్పగా మాట్లాడారు. ఆపై రౌండ్ టేబుల్ చేపట్టారు. ఇదే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఈడీ స్పష్టం చేసింది.
ఈడీ ఆఫీసు కు సీఎం కేసీఆర్ భవన్ కు జస్ట్ 5 నిమిషాల సమయం. మరో వైపు మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీని వెనుక మొత్తం ఉంటూ చక్రం తిప్పుతున్నారు సీఎం కేసీఆర్. ఆయన హైదరాబాద్ నుంచే కీ రోల్ పోషిస్తున్నారు
Also Read : తల వంచను భయపడను