Bhagwant Mann : రాజస్థాన్ లో ఆప్ దే రాజ్యం – మాన్
కాంగ్రెస్, బీజేపీలకు జనం బై బై
Bhagwant Mann : రాజస్థాన్ లో రాజకీయ వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం మొదలైంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి భరోసాతో ఉంది. మరోవైపు సీఎం అశోక్ గెహ్లాట్ , మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ హై కమాండ్ ఆదేశించినా వినడం లేదు. ఇద్దరినీ పార్టీ పిలిపించుకుని కలిసి ముందుకు సాగాలని కోరింది. ఈ తరుణంలో ఈసారి ఎలాగైనా సరే పాగా వేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా ఇవాళ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో ఆప్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఢీల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ మాన్(Bhagwant Mann) హాజరయ్యారు. ఈ సందర్బంగా మాన్ ప్రసంగిస్తూ ప్రజలు ఇక్కడ మార్పు కోరుకుంటున్నారని వారంతా ఆప్ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్వలాభం చూసుకున్నాయని కానీ ప్రజల బాధలు పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని తమ పాలన ఎలా ఉంటుందో స్వయంగా పంజాబ్ గురించి తెలుసు కోవాలని స్పష్టం చేశారు. మెరుగైన పాలన కావాలంటే , ప్రతి ఒక్కరికీ రూపాయి చేరాలంటే ఆప్ ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు ఆప్ సీఎం భగవంత్ మాన్. కాంగ్రెస్ , బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల మొదటి గర్జన రాజస్థాన్ లో ప్రతిధ్వనించిందన్నారు.
Also Read : Gandhi Peace Prize 2021 : గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతి