Election Results 2022 : ఆప్ హ‌వా క‌మ‌లం కంటిన్యూ

ఉత్త‌రాఖండ్..మ‌ణిపూర్ ..గోవాలో కంటిన్యూ

Election Results 2022 : దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఎన్నిక‌ల ఫ‌లితాలు(Election Results 2022) ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నిజం కాబోతున్నాయి.

యూపీలో మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చే దిశ‌గా ప‌రుగులు తీస్తోంది యోగి నేతృత్వంలోని బీజేపీ. స‌మాజ్ వాది పార్టీ గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఇక ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పంజాబ్ లో కాంగ్రెస్ త‌న ప‌ట్టు కోల్పోయింది.

ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు పూర్తిగా తుడిచి వేసింది. యూపీలో 403 సీట్లు ఉన్నాయి. ప‌వ‌ర్ లోకి రావాలంటే 202 సీట్లు రావాలి. ఆ సంఖ్య‌ను ఎప్పుడో దాటేసింది. ఆప్ ఇక్క‌డ అధికారాన్ని చేసే దిశ‌గా సాగుతోంది.

ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సిద్దూ, సీఎం చ‌న్నీ వెనుకంజ‌లో ఉన్నారు. ఆప్ సీఎం అభ్య‌ర్థి భ‌గ‌వంత్ మాన్ ఇంటి ముందు ఆప్ కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు సంబురాల్లో మునిగి పోయాయి.

ఇక పంజాబ్ లో 117 సీట్ల‌కు గాను 80 సీట్ల‌లో ఆప్ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కాబోతోంద‌ని స‌మాచారం. ఇది ఆ పార్టీకి పెద్ద దెబ్బేన‌ని చెప్ప వ‌చ్చు. ఎక్క‌డా రైతుల ప్ర‌భావం క‌నిపించ లేదు.

ఇక్క‌డ ఆ పార్టీలో నెల‌కొన్న సంక్షోభ‌మే ఈ అప‌జ‌యానికి కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొన్నారు. ఇక ఉత్త‌రాఖండ్ లో బీజేపీ కాంగ్రెస్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది.

ఇక మ‌ణిపూర్ , గోవా రాష్ట్రాల‌లో బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం ఇక్క‌డ హంగ్ ఏర్ప‌డుతుంద‌ని చెప్పిన అంచ‌నాలు త‌ప్పాయి. ఈ ఎన్నిక‌లు త‌మ పాల‌నా ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఇప్ప‌టికే పీఎం న‌రేంద్ర మోదీ చెప్పారు.

ఇక పంజాబ్ లో మోదీ ప‌ర్య‌టించినా ఇక్క‌డ ప్ర‌భావం చూప‌లేక పోయారు. రాబోయే రోజుల్లో ఆప్ పుంజుకోవ‌డం త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తోంది.

Also Read : ఆస్తుల అమ్మ‌కానికి ఎస్పీవీ ఏర్పాటు

Leave A Reply

Your Email Id will not be published!