AAP Punjab : పంజాబ్ ను ఊడ్చేసిన ఆప్ చీపురు

కాంగ్రెస్ కు కోలుకోలేని బిగ్ షాక్

AAP Punjab : భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఇది ఊహించ‌ని ప‌రిణామం. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌కు ద‌గ్గ‌ర‌గా రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆల్ రెడీ పంజాబ్ లో ప‌వ‌ర్ లో ఉన్న కాంగ్రెస్ త‌న ప‌వ‌ర్ ను కోల్పోయింది.

ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు(AAP Punjab) పూర్తిగా ఊడ్చేసే ప‌నిలో ప‌డింది. మొత్తం రాష్ట్రంలోని 117 సీట్ల‌లో 88 సీట్ల‌లో ఆప్ లీడింగ్ లో కొన‌సాగుతోంది. చివ‌రి ఫలితాలు వ‌చ్చే స‌రిక‌ల్లా మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్ పార్టీ స్వ‌యంగా చేసుకున్న త‌ప్పిదాలే కొంప ముంచాయి. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే 59 సీట్లు కావాల్సి ఉంది ఆప్ (AAP Punjab)కు. వాటిని ఎప్పుడో దాటేస్తూ ముందుకు సాగుతోంది.

ఆ పార్టీకి చెందిన క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోకు, హామీల‌కు పంజాబ్ ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు. ఎక్ మౌకా కేజ్రీవాల్ ఎక్ మౌకా భ‌గ‌వంత్ మాన్ అంటూ ఇచ్చిన నినాదానికి మొగ్గు చూపారు.

ఐదు రాష్ట్రాల‌లో భాగంగా ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి త‌న స‌త్తాను చాటింది. పంజాబ్ లో గ‌తంలో ప‌ట్టు క‌లిగిన శిరోమ‌ణి అకాలీ ద‌ళ్ , భార‌తీయ జ‌నతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల‌కు కోలుకోలేని షాక్ తగింది.

ప్ర‌స్తుతం ఎవ‌రి సాయం లేకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తోంది. హేమా హేమీలు ఓట‌మి బాట ప‌ట్టారు. చ‌న్నీ ద‌ళిత కార్డు ప‌ని చేయ‌లేదు.

Also Read : ఆప్ హ‌వా క‌మ‌లం కంటిన్యూ

Leave A Reply

Your Email Id will not be published!