AAP Maha Rally : ఢిల్లీలో ఆప్ మహా ర్యాలీ
కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా
AAP Maha Rally : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ను నిరసిస్తూ ఆదివారం దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్ ను. ఎవరికి సర్వాధికారాలు ఉంటాయనే దానిపై అటు కేంద్రం ఇటు ఢిల్లీ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాదోపవాదాలు వినిపించాయి సుప్రీంకోర్టులో. ఇరువురి వాదనలు విన్న సీజేఐ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
ఈ మేరకు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. కేవలం శాంతి భద్రతలు, భూ సంబంధ విషయాలు తప్పితే ఇంకే అధికారాలు కేంద్రం ఆధీనంలోని బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి నిర్ణయాలు తీసుకుంది ఆప్ ప్రభుత్వం.
దీనికి వ్యతిరేకంగా అమిత్ షా సారథ్యంలో కేంద్రం ఉన్నట్టుండి ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. పవర్స్ ను కట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది చట్టం కావాలంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. కాగా లోక్ సభలో భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ పార్టీలకు బలం ఉండగా రాజ్యసభలో ఆశించిన సంఖ్య లేదు. దీంతో విపక్ష పార్టీల చీఫ్ లు, సీఎంలతో కలిశారు సీఎం కేజ్రీవాల్. ఇవాళ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.
Also Read : Sanjay Kumar Jha : ఐఏఎస్ సంజయ్ కుమార్ ఝాపై కేసు
