Abhaya Hastam Form : దరఖాస్తులకు ఫీజు లేదు
తెలంగాణ ప్రభుత్వం వెల్లడి
Abhaya Hastam : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టింది. అభయ హస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందుకు గాను ఎలాంటి రుసుము ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Abhaya Hastam Forms Released
ఇదిలా ఉండగా అభయ హస్తం గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లు గ్రామ పంచాయతీ, పట్టణ , వార్డు ఆఫీసులలో ఉచితంగా లభిస్తాయని తెలిపింది. ప్రజలు ఎవరూ కూడా అధిక రుసుముతో ఫాంలను కొనుగోలు చేసి మోస పోవద్దని సూచించింది కాంగ్రెస్ సర్కార్.
తమ సర్కార్ పార దర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రజలు , లబ్దిదారులు పూర్తిగా వివరాలు తెలుసు కోవాలని సూచించింది. దరఖాస్తు ఫాంను, పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : Bhatti Vikramarka Mallu : పేదలకు ఇళ్ల నిర్మాణం