CBI Summons : అభిషేక్ బెన‌ర్జీకి సీబీఐ స‌మ‌న్లు

మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడికి షాక్

CBI Summons : ప‌శువుల అక్ర‌మ ర‌వాణా కేసులో రినామూల్ కు చెందిన అభిషేక్ బెన‌ర్జీకి సిబీఐ స‌మ‌న్లు(CBI Summons) జారీ చేసింది. ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన వ్య‌క్తిగా ఉన్నారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి మేన‌ల్లుడు. ఎంపీ టీచ‌ర్ల భ‌ర్తీలో అవినీతికి పాల్పడ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు విచార‌ణ‌ను నిలిపి వేసిన కొద్ది గంట‌ల‌కే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ స‌మ‌న్లు జారీ చేయ‌డం క‌ల‌కలం రేపింది.

మ‌రో వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో 9 గంట‌ల పాటు విచారించింది. ప్ర‌తిప‌క్షాలు కావాల‌ని త‌మ‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసి గొల్పుతున్నాయంటూ ఆరోపించాయి. ప‌శువుల అక్ర‌మ ర‌వాణా లో కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై కేసు న‌మోదైంది. ఇదే కేసులో సీఎంకు స‌న్నిహితుడిగా భావిస్తున్న తృణ‌మూల్ నేత అనుబ్ర‌తా మోండ‌ల్ గ‌త ఏడాది జూలైలో అరెస్ట్ అయ్యారు. ఇంకా జైలులోనే ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా 14 పార్టీలు పీఎంకు లేఖ‌లు కూడా రాశాయి. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కూడా చేశాయి. కానీ ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు ఉంటే ఆధారాల‌తో స‌హా రావాల‌ని ఆదేశించింది. దీనిపై సీజేఐ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ త‌రుణంలో ఎంపీకి స‌మ‌న్లు ఇవ్వ‌డం వెనుక రాజ‌కీయ ఉద్దేశం త‌ప్ప మ‌రొక‌టి లేద‌న్నారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.

Also Read : మ‌నీష్‌ సిసోడియా క‌స్ట‌డీ పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!