ACB Court Shock : చంద్రబాబు రిమాండ్ పొడగింపు
బిగ్ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
ACB Court Shock : విజయవాడ – ఏపీ స్కిల్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. వర్చువల్ గా ఇవాళ ఏపీ సీఐడీ కేసు విషయంపై విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు తాను ఏ తప్పు చేయలేదని జడ్జికి వివరించారు.
ACB Court Shock to Chandrababu
ఇప్పటికే చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ కోర్టు జడ్జి హిమ బిందు. ఇవాల్టితో గడువు ముగియడంతో రిమాండ్ ను రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు తాజాగా జడ్జి. ఇదిలా ఉండగా తన అరెస్ట్ తప్పుగా జరిగిందని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తరపు లాయర్లు వాదనలు వినిపించారు.
రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్ ను కొట్టి వేయాలని, ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పేర్కొన్నారు. తనకు బెయిల్ వస్తుందని ఆశించారు నారా చంద్రబాబు నాయుడు.
కానీ కోలుకోలేని రీతిలో ఏసీబీ కోర్టు మరోసారి దెబ్బ తగిలింది. తనను రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే తనను అరెస్ట్ చేశారంటూ వాపోయారు. ఆన్ లైన్ లో విచారించారు ఏసీబీ కోర్టు జడ్జి. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ విధించింది కోర్టు.
Also Read : Chandra Babu Naidu : చంద్రబాబు బయటకు వచ్చేనా